calender_icon.png 24 May, 2025 | 1:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్ణాటకలో సైబర్ నేరస్థుడిని అరెస్టు చేసిన ఖమ్మం సైబర్‌క్రైమ్ పోలీసులు

24-05-2025 12:00:00 AM

భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం మే 23 (విజయ క్రాంతి): మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేస్తామని ఖమ్మంకి చెందిన రిటైర్డ్ ఉద్యోగిని బెదిరించి, డిజిటల్ అరెస్టు చేసి సుమారు రూ 1.12 కోట్ల  దోచుకున్న కేసులోని వ్యక్తిని, ఖమ్మం సైబర్ క్రైమ్  పోలీసులు కర్ణాటకలోని హుబ్లీలో శుక్రవారం అరెస్టు చేసినట్లు సి.పి. సునీల్ దత్  తెలిపారు.

కేసు వివరాలలోకి వెళితే ఖమ్మం అర్బన్ మండలంలోని టీచర్స్ కాలనికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి అయిన నాగుల బ్రహ్మం కి ఫోన్ లో మనీ లాండరింగ్ పాల్పడారని, ముంబాయి పోలీసులమని, అరెస్టు చేస్తామని బెదిరించి, అక్టోబర్- 2024 లో ఫలు ధఫాలుగా సుమారు రూ 1.12 కోట్లు దోచుకున్న కేసులో, రూ. 32 లక్షలు అకౌంటికి వెళ్ళిన మహ్మద్ జాఫర్ బెల్గాంని కర్ణాటకలోని హుబ్లీలో అరెస్టు చేసినట్లు తెలిపారు.

నిందుతున్ని సైబర్ క్రైమ్ కోర్టులో హాజరుపరిచి, రిమాండ్ కి తరలించామన్నారు. ఈ కేసు విచారణలో ముఖ్య పాత్ర వహించి, కర్ణాటకలోని హుబ్లీలో నిందుతున్ని అరెస్టు చేసి, ఖమ్మంకి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా తీసుకువచ్చిన సైబర్ క్రైమ్ డి. ఎస్పీ, సీహెచ్‌ఆర్‌వి ఫణిందర్ ని, ఎస్త్స్ర రంజిత్ కుమార్ ని, సహకరించిన ఎస్త్స్ర విజయకుమార్   సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని  అభినందించారు.