24-05-2025 12:03:38 AM
భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం, మే 23 (విజయక్రాంతి) : ఖమ్మం జిల్లాలో సుమా రు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే పాలేరులోని నాగార్జున సాగర్ ఎడమ ప్రధాన కాలువ అండర్ టన్నెల్ (యూటీ) నిర్మాణ పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఎట్టిపరిస్ధితుల్లోనూ జూలై 10వ తేదీ నాటికి పనులు పూర్తిచేసి వానాకాలం సీజన్కు రైతాంగానికి సాగునీటిని విడుదల చేయాలని ఆదేశించారు. శుక్రవారం మంత్రి, కూసుమంచి మండలం జుజ్జులరావుపేటలో జరుగుతున్న పాలేరు సాగర్ కాలువ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు సెప్టెంబర్లో పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం జుజ్జుల రావు పేట సమీపంలో పాలేరు రిజర్వాయర్ దగ్గర ప్రధాన కాలువపై అండర్ టన్నెల్ (యూటీ) కొట్టుకపోయిందన్నారు. రైతులకు ఇబ్బంది కలగకూడదన్న ఆలోచనతో అప్ప ట్లో తాత్కాలిక ఏర్పాట్లు చేసి సాగునీటిని అందించడం జరిగిందన్నారు.
శాశ్వత ప్రాతిపదికన రూ. 14.20 కోట్లతో ఈ యూటీ కాలువ మరమ్మతులను చేపట్టామని, ఖమ్మం జిల్లాలో వ్యవసాయ రంగా నికి జీవనాధారమైన ఈ కాలువ మరమ్మతులను పూర్తిచేసి సాగునీరు అందిస్తామన్నారు. దీని వలన ఖమ్మం జిల్లాలో సుమా రు 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అం దుతుందన్నారు. ఒక్క పాలేరు నియోజకవర్గంలో 1.33 లక్షల ఎకరాలకు సాగునీరు అం దుతుందని మంత్రి తెలిపారు.
వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అత్యంత ప్రాధా న్యతా క్రమంలో అవసరమైతే రోజుకు రెం డు షిఫ్ట్లో పనిచేసి గడువులోగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి తనిఖీల సందర్భంగా ఇర్రిగేషన్ ఎస్‌ఇ ఎం. వెంకటేశ్వర్లు, డిఇ రమేష్ రెడ్డి, అధికారులు ఉన్నారు.