05-08-2025 12:49:46 AM
- కాంగ్రెస్-బీఆర్‌ఎస్ పాలనలపై ప్రజల విరక్తి
- స్థానిక ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టనున్న ఖమ్మం
- మీడియా సమావేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, స్థానిక సంస్థల ఎన్నికల ఖమ్మం జిల్లా ఇంచార్జ్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి
ఖమ్మం, ఆగస్టు 4 (విజయం క్రాంతి): తెలంగాణ రాజకీయ సమీకరణాల్లో ఇప్పు డు ఖమ్మం జిల్లా కేంద్రబిందువుగా మారిం ది. గతంలో ఎన్టీఆర్కు అండగా నిలిచిన ఈ జిల్లా, ఇప్పుడు ప్రధాని మోదీకి నైతిక మ ద్దతు తెలుపుతోంది. రాజకీయంగా నిరాశకు గురైన ప్రజలు, ప్రభుత్వ విధానాలపై అసహ నం వ్యక్తం చేస్తున్న యువత ఈసారి మార్పు కోసం ముందుకు వస్తున్నారనీ భారతీయ జ నతా పార్టీ రాష్ట్ర నాయకులు, స్థానిక సంస్థల ఎన్నికల ఖమ్మం జిల్లా ఇంచార్జ్, మాజీ మం త్రి ఇనుగాల పెద్దిరెడ్డి పేర్కొన్నారుఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన మహా సంపర్క్ అభి యాన్ కార్యక్రమంలో భాగంగా మీడియా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ జిల్లా గతంలో ఎన్టీఆర్కు రాజకీయ బలం ఇచ్చింది. అదే ప్రజలు ఇప్పుడు ప్రధా ని మోదీ నాయకత్వంలో బీజేపీకి శక్తిని ప్ర సాదించబోతున్నారు. ఖమ్మం జిల్లాలో రాజకీయ వాతావరణం మారుతోంది. ప్రజ లంతా మార్పు వైపు మొగ్గు చూపుతున్నారు. మేము బూత్ స్థాయిలో ప్రచారం నిర్వహిం చి, అభివృద్ధిని వివరించనున్నాం అన్నారు. బీఆర్‌ఎస్ కుటుంబ కలహాలతో అలజడి. కాంగ్రెస్ ప్రభుత్వంలో శూన్యతే మిగిలింది. సమన్వయం లేక ప్రభుత్వం చీలిపోయినట్లయింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితి ఎంత దుర్భరమో ప్రజలు చూస్తున్నారు అ న్నారు.
యువతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.బీజేపీ ఖమ్మం జిల్లా అ ధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర రావు మాట్లాడుతూ జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానా ల్లో అత్యధిక విజయం సాధించడమే మా ల క్ష్యం. గతంలో టీడీపీ వర్గాలు ఇప్పుడు బీజేపీలోకి వచ్చి పార్టీకోసం పని చేస్తున్నాయి. రాష్ట్రంలో ముగ్గురు మంత్రులు ఖమ్మం జి ల్లాకు ఉన్నా అభివృద్ధి నిధులు రావడం లేదన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి నేత లు దేవకీ వాసుదేవరావు, ఇవి రమేష్, నున్న రవికుమార్, పుల్లారావు యాదవ్, దొంగల సత్యనారాయణ, నంబూరి రామలింగేశ్వరరావు, అల్లిక అంజయ్య, జ్వాలా నరసింహా రావు, గడిల నరేష్, ధనియాకుల వెంకటనారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.