calender_icon.png 10 May, 2025 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరి ఖనిలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం

10-05-2025 03:43:16 PM

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విస్త్రుత తనిఖీలో ఏసీపీ మడత రమేష్ 

గోదావరిఖని,(విజయక్రాంతి): గోదావరిఖని సబ్ డివిజనల్ లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని గోదావరి ఖని ఏసీపీ మడత రమేష్(Godavarikhani ACP Madatha Ramesh) తెలిపారు. భారత సరిహద్దు లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, పెద్దపెల్లి డిసిపి కరుణాకర్  ఆదేశాల మేరకు గోదావరిఖని ఏసిపి రమేష్  పర్యవేక్షణలో గోదావరిఖని 1- టౌన్ సీఐ ఇంద్రసేన రెడ్డి ఆధ్వర్యంలో  గోదావరిఖని బస్టాండ్ , మెడికల్ కళాశాల, హాస్పిటల్, సింగరేణి ఏరియా హాస్పిటల్, జిఎం ఆఫీస్, కోర్ట్ పరిసరాలు ముఖ్యగా ఎక్కువ జన సంచారం తో రద్దీగా ఉండే ప్రాంతాలలో బాంబు డిస్పోజల్ టీమ్, డాగ్స్ స్క్వాడ్  బృందాలతో లగేజ్, పార్సిల్ లను, బ్యాగ్ లను తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏసీపి మాట్లాడుతూ... ప్రజల రక్షణ, భద్రత చర్యలలో భాగంగా  డాగ్, బాంబు స్క్వాడ్ లతో తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులను గమనిస్తే, వస్తువులు కనిపిస్తే, సందేహాస్పదంగా ఉన్న వాహనాల సమాచారాన్ని పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఏసీపి తెలిపారు. ఈ తనిఖీ ల్లో 1- టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ లు భూమేష్, రమేష్, శ్రీనివాసులు, కోటేశ్వర్, బాంబు స్వాడ్‌, డాగ్‌ స్వాడ్‌ పోలీస్ లు పాల్గొన్నారు.