26-10-2025 08:17:55 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణ ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ ఆదివారం రాష్ట్రస్థాయి విశిష్ట వైద్య రత్న అవార్డును అందుకున్నారు. ఫిజియోథెరపీ, సైకాలజీ కౌన్సిలింగ్, సామాజిక కార్యక్రమాలకు గుర్తింపుగా రాష్ట్రస్థాయి విశిష్ట వైద్యరత్న పురస్కారం-2025 ఎంపికయ్యారు. డాక్టర్ కత్తి కిరణ్ శ్రీమతి కృష్ణవేణి నర్సింగ్ సూపర్ఇంటెన్టెంట్ ఫిజియోథెరపిస్ట్, సైకాలజిస్ట్, పాటే మా ప్రాణం, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ఆదివారం స్వీకరించారు. అవార్డు అందుకోవడం గర్వంగా భావిస్తున్నానని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని ఆయన వెల్లడించారు.