12-10-2025 12:48:45 AM
కరీంనగర్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో డిసెంబర్ 1, 2, 3 తేదీలలో రైతు ప్రయోజనాలకై కిసాన్ గ్రామీణ మేళా నిర్వహిస్తున్నామని కిసాన్ జాగరణ్ అధ్యక్షుడు, రైతు నాయకుడు పి సుగుణాకర్‌రావు తెలిపారు. కరీంనగర్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2022, 2023 సంవత్సరాల్లో రెండు పర్యాయాలు కరీంనగర్‌లో కిసాన్ గ్రామీణ మేళా పెద్ద ఎత్తున నిర్వహించామని, ఈ మేళా తెలంగాణలోనే అధిక సంఖ్యలో ప్రజలు సందర్శించిన వ్యవసాయ ప్రదర్శనలుగా గుర్తించబడినది అని తెలిపారు.
ఈసారి కూడా వినూత్న పద్ధతులతో ఆధునిక, శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి రైతు వద్దకు చేర్చుట, రైతు పంటల అధిక ఉత్పత్తిని పెంచేల, రైతులు తమ పంటలను అధిక ధరలకు అమ్ముకునే అవగాహన, పంట మార్పిడితో వచ్చే లాభాలు, డ్రోన్స్, రోబోట్స్ లాంటి కొత్త పరికరాల వినియోగం, డైరీ, గొర్రెల పెంపకం, ఫామ్ ఆయిల్, కూరగాయలు, పండ్ల తోటలతో లాభాలు గడించడం లాంటి అనేక విషయాలపై రైతులను చైతన్య పరిచాలనే లక్ష్యంగా కిసాన్ జాగరన్, నవనిర్మాణ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కిసాన్ గ్రామీణ మేలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
కేంద్ర ,రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు అధికారులు భాగస్వామ్యులుగా చేసే కేంద్ర, రాష్ట్ర పథకాలు రైతులకు చేర్చే విధంగా ఈ మేళా ఉంటుందని తెలిపారు. రైతులకు కావలసిన మిషనరీ పనిముట్లు, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు హోల్ సేల్ ధరలకే వారు అమ్ముటకు కొన్ని కంపెనీలు ప్రకటించయున్నాయని తెలిపారు. నవనిర్మాణ ఫౌండేషన్ అధ్యక్షుడు రాంబాబు మాట్లాడుతూ..
రైతులకు, గ్రామీణ ప్రజలకు లాభం చేకూర్చే విధంగా ఈ కిసాన్ గ్రామీణ మేల ఉంటుందని ఈ తరహా లో తెలంగాణ రాష్ట్రంలో మరేక్కడ వ్యవసాయ ప్రదర్శన ఉండదని తెలిపారు. కార్యక్రమంలో నవనిర్మాణ ఫౌండేషన్ సభ్యులు సాయి జ్యోతి, గంప జగన్, దుర్గం మారుతి, జెడి భగవాన్, తాడూరి బ్రహ్మం, కూరగాయల తిరుపతి, మిరియాల్కర్ ఆనంద్, నగునూరి లక్ష్మణ్, నరసింహారెడ్డి,సత్యనారాయణ రావు, కుమార్, బ్రిడ్జ్ మోహన్ రాథోడ్, భాష బోయిన ప్రదీప్ పాల్గొన్నారు.