calender_icon.png 11 December, 2025 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ కాలువకు బీఎన్‌రెడ్డి పేరు పెట్టాలి

11-12-2025 12:32:33 AM

రౌండ్ టేబుల్ సమావేశంలో కవులు, రచయితల తీర్మానం

ఖైరతాబాద్; డిసెంబర్ 10 (విజయ క్రాంతి): ఎస్‌ఆర్‌ఎస్‌పి రెండవ దశ కాలువ పేరు మార్పుపై ప్రభుత్వం పునరాలోచన చేసి భీమ్ రెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలని రౌండ్ టేబుల్ సమావేశంలో పలువు సీనియర్ పాత్రికేయులు, కవులు, రచయితలు తీర్మానించారు. సీనియర్ పాత్రికేయులు మురళి అధ్యక్షతన బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్లో బీఎన్.రెడ్డి జ్ఞాపకాలు ఎస్ ఆర్‌ఎస్‌పి కాల్వ పేరు మార్పుపై సమాలోచనలు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమా వేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు గోరేటి వెంకన్న, సీనియర్ జర్నలిస్టులు అల్లం నారాయణ, రామచంద్రమూర్తి, అశోక్, కట్టా శేఖర్ రెడ్డి, కే శ్రీనివాస్, పాశం యాదగిరి, విజయ్ కుమార్ రెడ్డి, ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి, జై బోలో తెలంగాణ చిత్ర దర్శకుడు శంకర్, తదితరులు హాజరై మాట్లాడారు. ఎస్సారెస్పీ (శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్) రెండో దశ ద్వారా ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు 4.40 లక్షల ఎకరాలకు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ భీమిరెడ్డి నర్సింహారెడ్డి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో పోరాడి సాధించారని గుర్తు చేశారు.