calender_icon.png 1 November, 2025 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ను అభివృద్ధి చేసేందుకు అవకాశం ఇవ్వండి: కిషన్ రెడ్డి

01-11-2025 03:18:44 PM

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశం ఇవ్వాలని, స్థానికంగా అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఎలప్పుడూ సిద్ధంగా ఉండే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) శనివారం నాడు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో( Jubilee Hills By Election) బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌ కి మద్దతుగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి కిషన్ రెడ్డి రహమత్ నగర్‌ డివిజన్‌లో ఇంటింటికీ పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రజల ఆత్మీయ పలకరింపులతో సాగిన పాదయాత్రలో హామీల పేరుతో కాంగ్రెస్ ఏరకంగా నమ్మకద్రోహం చేసిందో, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్రాన్ని ఎలా దివాళ తీసిందో వివరించానని కిషన్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి పట్టించుకోకుండా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న ఈ రెండు పార్టీలను ఓడించి తగిన బుద్ధి చెప్పాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్లకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు..