01-11-2025 03:19:55 PM
వలిగొండ,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం స్టీల్, సిమెంట్, ఇసుక తక్కువ ధరలకు లబ్ధిదారులకు అందించాలని ఎంపీడీవో జలంధర్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మెటీరియల్ సప్లై చేసే ట్రేడర్స్ మరియు మేస్త్రీలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఇసుక రవాణా కూడా తక్కువ ధరకు సరఫరా చేయాలని, ఇందిరమ్మ ఇంటి నిర్మాణ త్వరగా పూర్తి అయ్యేలా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో తహసిల్దార్ దశరథ, ఏఈ కిరణ్, హెడ్ కానిస్టేబుల్ పురుషోత్తం, ట్రేడర్స్ యజమానులు, ఇటుక బట్టి యజమాని, మేస్త్రీ లు పాల్గొన్నారు.