15-12-2024 04:57:04 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): మెగా లోక్ అదాలత్ లో భాగంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో రికార్డు సాధించింది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులోపడి డబ్బుల పోగోట్టుకున్న బాధితులకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అండగా నిలిచింది. 4,893 మంది సైబర్ బాధితులకు అధికారులు రూ.33.27 కోట్లు రిఫండ్ చేయబడిందని అధికారులు పేర్కొన్నారు. గతంలో 5355 మంది బాధితులకు రూ.27.2 కోట్లను అధిగమించింది. సైబరాబాద్ పరిధిలో రూ.12.77 కోట్లు, హైదరాబాద్ రూ.8.84 కోట్లు, రాచకొండ రూ.4.53 కోట్లు, హెడ్ క్వార్టర్స్ పరిధిలో రూ.1.06 కోట్లు, సంగారెడ్డి రూ.98.63 లక్షలు రిఫండ్ చేసింది. లోక్ అదాలత్ లో ఈ ఏడాది ఇప్పటివరకు 17,210 మందికి బాధితులకు ఇప్పటి వరకు రూ.155.22 కోట్లు రిఫండ్ చేసినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు వెల్లడించారు. న్యాయవ్యవస్థ క్రియాశీల మద్దతు, కృషి వల్ల ఇది సాధ్యమైంది అధికారులు తెలిపారు.