calender_icon.png 2 May, 2025 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిచెన్ టిప్స్

27-04-2025 12:00:00 AM

వంటింటి గట్టు జిడ్డుగా ఉంటే సబ్బు, వెనిగర్, గోరువెచ్చటి నీళ్లు కలిపి స్క్రబ్బర్‌తో రుద్దితే సరిపోతుంది. 

అరటికాయలు కోసిన తర్వాత నల్లబడకుండా ఉండాలంటే వాటిని వేసే నీళ్లలో నాలుగు చుక్కల వెనిగర్ కలపాలి.

కప్పుల్లో కాఫీ, టీ మరకలు వదలకపోతే వెనిగర్, ఉప్పు కలిపి రుద్దితే త్వరగా వదిలిపోతాయి.

కొబ్బరి పాలు కొన్ని గంటలపాటు తాజాగా ఉండాలంటే చిటికెడు ఉప్పు కలపాలి. 

బాదం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.. నిల్వ చేసే డబ్బాలో చెంచా చక్కెర వేయాలి.

బెండకాయలకు ఉన్న తొడిమెలు, తోక తీసి ప్లాస్టిక్ కవర్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెడితే తాజాగా ఉంటాయి.

నెయ్యి కరిగించేటప్పుడు కొద్దిగా లావు ఉప్పు వేస్తే.. నెయ్యి మృదువుగా ఉంటుంది.