25-07-2025 07:20:42 PM
ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): జులై 28న రాష్ట్రవ్యాప్తగా కలెక్టరేట్ల ముందు జరుగుతున్న మధ్యాహ్నం భోజన కార్మికుల ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం ఎంఈఓ కార్యాలయం నందు సమ్మెకు మద్దతుగా ఎంఈఓ సిబ్బందికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు అబ్దుల్ నబి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లలో మధ్యాహ్నం భోజనంలో వెజిటేబుల్ బిర్యాని, రెండు కూరలు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం బాగానే ఉందనీ మెనూ చార్జీలు పెంచకుండా, నిధులు విదల్చకుండా, మెనూ ఎలా అమలు చేయాలని వాపోయారు. మధ్యాహ్న భోజన కార్మికులకు గత సంవత్సరం నుండి రావలసిన బిల్లులు జీతాలు ఇవ్వకపోగా స్కూళ్లలో కొత్త మెను అమలు చేయాలని ఒత్తిడి చేయడం సరికాదని ఈ సమస్యల పరిష్కారం కోసం జులై 28న కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కుమారి, ఎల్క పల్లి ఐలమ్మ తదితరులు పాల్గొన్నారు.