25-07-2025 07:12:57 PM
బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్
మందమర్రి,(విజయక్రాంతి): త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో అన్ని గ్రామ పంచాయతీలలో కాషాయ జెండా ఎగుర వేస్తామని జిల్లా బిజెపి అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. చిర్రకుంట గ్రామంలో శుక్రవారం నిర్వహించిన మండల కమిటీ, వివిధ గ్రామాల బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో బీజేపీకి అనుకూల వాతా వరణo ఉందని త్వరలో జరగనున్న ఎన్నికల్లో అన్ని గ్రామపంచాయతీలలో సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలను గెలుచు కోవడంతో పాటు జేడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకొని మండలంలో బీజేపీ సత్తా చాటుతుందని ఆయన స్పష్టం చేశారు. మండలంతో పాటు చెన్నూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బిజెపికి ప్రజల ఆదరణ పెరుగుతుందని రానున్న స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గంలో బిజెపి అత్యధిక స్థానాలు గెలుస్తుంద ని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.