27-04-2025 12:00:00 AM
వేసవిలో పండ్లు, ఆకుకూరలు చాలా త్వరగా పాడైపోతుంటాయి. ఫ్రిజ్‌లో పెట్టినా వాటి తాజాదనం ఉండటం కష్టం. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో చూద్దాం..
ఎండాకాలంలో కొత్తిమీర, కరివేపాకు ఫ్రిజ్‌లో పెట్టినా మరుసటిరోజే వాడిపోతుంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే.. ఐస్ ట్రేలో సగం వరకు కరిగించిన బటర్ లేదా నెయ్యిని పోసి అందులో తరిగిన కొత్తిమీర, కరివేపాకు వేసి ఫ్రీజర్‌లో ఉంచాలి. రెండు రోజుల తర్వాత, ఆ క్యూబ్స్‌ని జిప్‌లాక్ కవర్లలోకి మార్చి రిఫ్రిజిరేటర్లో భద్రపరచాలి. కూరలు ఉడికేటప్పుడు ఈ క్యూబ్స్‌ని అందులో వేస్తే సరిపోతుంది.
తాజాగా..
అలాగే ఆకుకూరలు ఎక్కు వ రోజులపాటు తాజాగా ఉండాలంటే వాటిని కడిగి, ఆరబెట్టి, సన్నగా త రుక్కోవాలి. త ర్వాత ఐస్ ట్రేలలో నీళ్లు పోసి ఆకులు మునిగే వరకు ఫ్రీజర్‌లో ఉంచాలి. వీటికి ఇతర పదార్థాల వాసన పట్టకుండా ఉండాలంటే ఐస్‌ట్రేలకు ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ ఫిల్మ్ చుడితే సరిపోతుంది.
తాజాదనం కోసం..
కొన్ని రకాల పండ్లను వెంటనే వాడకపోతే వాటిని నిల్వ చేయడానికి ఫ్రీజర్‌ను ఆశ్రయించాలి. ఆయా పండ్లను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, ఒక కవరు ఉంచి.. సగం నీటిలో మునిగేవరకు ఐస్ ట్రేలో ఉంచాలి. రెండు రోజుల తర్వాత జిప్‌లాక్ కవర్లలోకి మార్చి ఫ్రీజర్‌లో భద్రపరచాలి. తినాలనుకున్నప్పుడు ఓ గంట ముందు ఫ్రీజర్‌లోంచి తీసి తింటే సరిపోతుంది. పండ్లు తాజాగా కూడా ఉంటాయి.