calender_icon.png 1 May, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పైసీ ఫుడ్.. అతిగా వద్దు!

27-04-2025 12:00:00 AM

ఇటీవల కాలంలో ‘బిర్యానీ లేనిదే ముద్ద దిగదు’ అనే వారిని చాలా మందినే చూసుంటాం. కాని మసాలాలు అధికంగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే సైడ్‌ఎఫెక్ట్స్ తప్పవు అంటున్నారు నిపుణులు.

తరచూ మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే సున్నితంగా ఉండే కడుపు లోపలి పొరలు దెబ్బతింటాయి. గుండెల్లో మంటగా అనిపిస్తుంది. 

మసాలాలు ఎక్కువైతే జీర్ణం అవ్వడానికి అధిక సమయం పడుతుంది. కడుపుబ్బరంగా అనిపిస్తుంది. తేన్పులతో ఇబ్బంది పడతారు. 

కొన్నిసార్లు డయేరియా సమస్య వస్తుంది. ఆహారంలో కారం, మసాలాలు ఎక్కువగా ఉంటే.. వాంతులు, విరేచనాల వంటివీ వెంటాడతాయి.

కొందరికైతే చర్మంపై దద్దుర్లు, మొటిమలు, మచ్చలు, దురద వంటి సమస్యలు వస్తాయి. చర్మం వాయడంతో పాటు మంటగా అనిపిస్తుంది. 

వెల్లుల్లి, ఉల్లిపాయ, కారం ఘాటైన వాసనను కలిగి ఉంటాయి. వీటిని తిన్న తర్వాత చాలా సమయం వరకు నోరు దుర్వాసన వస్తుంది. 

అధిక కారం, మసాలాలు ఉన్న ఆహారం తరచూ తీసుకుంటే గొంతులోని సున్నితమైన పొరలు దెబ్బతింటాయి. శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. 

శరీర ఉష్ణోగ్రతలు పెరిగేందుకు మసాలాలు కారణం అవుతాయి. సాధారణ స్థాయి కంటే చెమటలు ఎక్కువగా పడతాయి.