25-01-2026 12:14:35 AM
హైదరాబాద్, జనవరి 24: ప్రతిష్టాత్మక సీనియర్ మహిళల జాతీయ కబడ్డీ చాంపియన్షిప్ హైదరాబాద్లో జరగనుంది. గచ్చి బౌలి ఇండోర్ స్టేడియం వేదికగా ఈ నెల 27 నుంచి 30వ తదీ వరకూ జరిగే టోర్నీలో ఇండియన్ రైల్వేస్ టీమ్, 30 రాష్ట్రాల జట్లు పాల్గొంటాయి. పోటీల బ్రోచర్ను క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని వీరేశ్, ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి తో కలిసి ఆవిష్కరించారు. తెలంగాణను క్రీడల హబ్గా మార్చడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందనీ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు.
తెలంగాణ ప్రతిష్టను పెంచేలా మ హిళల జాతీయ కబడ్డీ చాంపియన్షిప్ నిర్వహణకు క్రీడా శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ నెల 27న సాయం త్రం టోర్నీ ప్రారంభం అవుతుందని, 28, 29న లీగ్ మ్యాచ్లు, 30 నాకౌట్ మ్యాచ్లు జరుగుతాయని తెలంగాణ కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని వీరేశ్, ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి తెలిపారు. టోర్నీ జరిగే నా లుగు రోజుల పాటు అభిమానులకు స్టేడియంలో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్టు వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత మహిళ జ ట్టు ఎంపికకు టోర్నీ సెలెక్షన్ ట్రయల్ అవుతుందన్నారు.