calender_icon.png 15 November, 2025 | 4:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కోమటిరెడ్డి

28-07-2024 02:22:13 PM

చార్మినార్: భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కోమటిరెడ్డి అమ్మవారికి అధికారికంగా పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలన్నారు. కరోనా వంటి మహమ్మరులు రాకుండా అమ్మవారు ప్రజలందరిని కాపాడలని కోరుకోవడం జరిగిందని, గత సంవత్సరం వర్షాలు లేక రైతులంతా ఇబ్బంది పడ్డారు.

ఈసారి అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు పడాలని, పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేమంతా హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతున్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు.అఖిలపక్ష నిర్ణయానికి అనుగుణంగా పాత డెజైన్ తో కొత్త ఉస్మానియా దవాఖాన, కొత్తగా హైకోర్టు భవనాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల ప్రజల ఆరోగ్యాలను దెబ్బతిస్తున్న మూసి నదిని ప్రక్షాళన చేసి అక్కడ టూరిస్ట్ స్పాట్స్ అభివృద్ధి  చేస్తామన్నారు.  హైదరాబాద్ అభివృద్ధిని కొత్తపుంతలు తొక్కించాలని సీఎం కృతనిశ్చయంతో ఉన్నారు.

పాతబస్తీ స్థితిగతులను మార్చేందుకు మెట్రోను విస్తరిస్తున్నామని, హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్ లో 10 వేల కోట్ల నిధులు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. మేడిగడ్డ బ్యారేజి కుంగడంలో కుట్ర ఉందన్న బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై విలేకర్ల ప్రశ్న అడిగారు. దేవాలయం దగ్గర రాజకీయాలు మాట్లాడటం భావ్యం కాదన్న మంత్రి పేర్కొన్నారు. మేడిగడ్డ కుంగినప్పుడు అధికారంలో ఉన్నది కేటీఆరే.. మేం కుట్రలు చేస్తే డ్యామ్ లోపలికి ఎలా కుంగుతుందని ప్రశ్నించారు. పోటీ చేసిన సగం సీట్లలో డిపాజిట్లు రానీ బీఆర్ఎస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.