calender_icon.png 15 November, 2025 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తొలి బోనాల పండుగ

28-07-2024 02:02:50 PM

హైదరాబాద్ : లాల్ దర్వాజ బోనాల ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టువస్తాలను సమర్పించారు. లాల్ దర్వాజ ఆలయ కమిటీ, ఎండోమెంట్ అధికారులు డిప్యూటీ సీఎం భట్టికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు బోనాల ఉత్సవాలు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తొలి బోనాల పండుగ జరిగిందని, బోనాల ఉత్సవాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బోనాల పండుగకు రూ.20 వేల కోట్లు, హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించిందని భట్టి విక్రమార్క తెలిపారు.