28-07-2024 02:56:08 PM
హైదరాబాద్: కుతుబ్ షాహీ టూంబ్స్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ లో ఏర్పాటు చేసిన అగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ, ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్, పర్యాటక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కుతుబ్ షాహీ టూంబ్స్ లో సీఎం రేవంత్ రెడ్డి మొక్కలు నాటి, కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్కును సందర్శించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కుతుబ్ షాహీ వారసత్వ సంపద పరిరక్షణ ప్రాజెక్టును 2013లో ఆగాఖాన్ ఫౌండేషన్ చేపట్టిందని చెప్పారు. శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు ఈ ప్రాంతాన్ని పాలించారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వారి ప్రత్యేకమైన సాంస్కృతిక ముద్ర వేశారని సీఎం కొనియడ్డారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం రాష్ట్రానికి గర్వకారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.