calender_icon.png 15 November, 2025 | 5:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాదయాత్ర చేస్తోన్న అయ్యప్పలకు భిక్షా కార్యక్రమం

15-11-2025 04:00:19 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): అమ్మవారిపల్లి వద్ద పాదయాత్రలో కొనసాగుతున్న అయ్యప్ప స్వాములకు శనివారం భిక్షా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోరబండ సైడ్–2 అయ్యప్ప స్వామి దేవాలయ చైర్మన్ లక్ష్మణ్ గౌడ్, గురుస్వామి విజయ్, కాశి గురుస్వామి, కృష్ణ స్వామి, సత్యనారాయణ, తివారి, సోమేశ్ తదితర గురుస్వాములు పాల్గొన్నారు. అయ్యప్ప స్వాములకు భక్తులు సమర్పించిన భిక్షను దేవాలయ వేదపండితుల ఆశీర్వాదమధ్య స్వీకరించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన దేవాలయ కమిటీ సభ్యులు భక్తులకు ధన్యవాదాలు తెలిపారు.