calender_icon.png 7 September, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

పెండింగ్ లో ఉన్న క్లెయిమ్స్ ను వెంటనే పరిష్కారం చేయాలి

07-09-2025 06:54:30 PM

కార్మికుడికి వెల్ఫేర్ బోర్డు ద్వారా  9000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి వీరారెడ్డి      

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): జిల్లాలో పెండింగులో ఉన్న క్లెయిమ్స్ ని వెంటనే పరిష్కారం చేయాలని, నిర్మాణ రంగంలో పనిచేస్తున్న 60 సంవత్సరాలు నిండిన ప్రతీ కార్మికుడికి వెల్ఫేర్ బోర్డు ద్వారా 9000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి(CITU State Vice President Tummala Veera Reddy) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో నల్లగొండ మండల భవన నిర్మాణ కార్మికుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కార్మికుల ఉద్దేశించి మాట్లాడుతూ.. అనేక పోరాటాల ఫలితంగా 1996లో వెల్ఫేర్ బోర్డు సాధించుకున్నామని అన్నారు. సిఐటియు కార్మికుల అభ్యున్నతి కోసం హక్కులను కాపాడడం కోసం అనునిత్యం పాటుపడుతుందని కార్మికుల పక్షాన పోరాడుతుందని అన్నారు. కార్మికులు దరఖాస్తు చేసుకున్న క్లెయిమ్స్ పెండింగులో ఉన్న వాటిని వెంటనే పరిష్కారం చేయాలని అన్నారు.

ఖాళీగా ఉన్న ఏఎల్ఓ, ఏసీఎల్ ఇతర సిబ్బంది నియమాకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డులో ఉన్న నిధులను ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తూ కార్మికుల అభివృద్ధి కోసం ఖర్చుచేయడం లేదని అన్నారు. వెల్ఫేర్ బోర్డు ద్వారా 60 సంవత్సరాలు పైబడిన కార్మికులకు 9000 రూపాయలు పెన్షన్ గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ప్రమాద, సాధారణ మరణాల ఎక్స్గ్రేశాలను, పెళ్లి కానుక ప్రసూతి కానుకలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని హర్షం వ్యక్తం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం కార్మికులను యాజమాన్యాలకు కట్టు బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చి పని భారాన్ని పెంచి కార్మికులను ఆందోళనకు గురి చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పని గంటలను సమర్థిస్తూ పెంచిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం వెంటనే నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 20న నల్లగొండ పట్టణంలో జరిగే భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా మహాసభలను కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు పోలే సత్యనారాయణ, సిఐటియు పట్టణ కన్వీనర్ ఆవుట రవీందర్ యూనియన్ మండల అధ్యక్షులు గాదె యాదయ్య, దోటి పరమేశ, బొల్లం సత్తయ్య, మల్లెబోయిన వెంకన్న, ఉప్పునూతల వెంకన్న, జాగటి మురళి, పోలే ప్రేమయ్య,  కృష్ణ, లింగస్వామి, వెంకన్న రవి తదితరులు పాల్గొన్నారు.