07-09-2025 06:42:08 PM
రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం..
చండూరు (విజయక్రాంతి): త్రిబుల్ ఆర్ వల్ల భూములు కోల్పోతున్న రైతులకు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అమలు చేయాలని, 2013 చట్టాన్ని అమలు చేసి నష్టపోతున్న రైతాంగాన్ని నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం(Farmers Association State Leaders Banda Srisailam) అన్నారు. ఆదివారం గట్టుప్పల్ మండల పరిధిలోని తేరటుపల్లి గ్రామంలో త్రిబుల్ ఆర్ రోడ్డు వల్లరైతులు భూములు పోతున్నాయని గ్రామస్తులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఈ రోడ్డు విస్తరణపై మూడు అలైన్మెంట్ చేశారని, ఒకటి, రెండు అలైన్మెంట్ అమలు చేయాలని, మూడవ అలైన్మెంట్లో రైతులు భూములు కోల్పోతున్నారని, రైతులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే రోడ్డు పనులు ప్రారంభించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మూడవ అలైన్మెంట్ వల్ల ఎక్కువమంది రైతులు భూములు కోల్పోవడం జరుగుతుందని, మరి భూములు కోల్పోతే ఓపెన్ వాల్యూ వెషన్ మీద భూములు పోయే రైతులకు నష్టపరిహారం నాలుగు రేట్లు పెంచి ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు ఇప్పుడు భూములు కోల్పోతే ముందు భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, అందుకనే భూమికి నాలుగు రేట్లు పెంచి నష్ట పరిహారం ఇవ్వాలని, లేకపోతే రోడ్డు విస్తరణ పనులు అడ్డుకుంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పగిళ్ల శ్రీనివాస్, అచ్చిన శ్రీనివాస్, వల్లూరి శ్రీశైలం, మల్గే శివ, బండారి కృష్ణయ్య, పబ్బు మారయ్య, కట్ట కృష్ణయ్య, సత్తయ్య, విజిలి రాములు, అచ్చిన బీరయ్య తదితరులు పాల్గొన్నారు.