calender_icon.png 7 September, 2025 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

భారీ వర్షంతో రహదారులు జలమయం..

07-09-2025 06:35:49 PM

వడ్డేపల్లి (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా(Hanamkonda District) అంబేద్కర్ జంక్షన్ నుండి వడ్డేపల్లి వెళ్లే రోడ్డులోనీ భవాని నగర్, ఇంద్రనగర్, అశోక్ కాలనీ ఇతర కాలనీలో ఆదివారం ఉదయం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురవడంతో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో పలుచోట్ల రోడ్లు జలమయమయ్యాయి. వర్షపు నీరు రోడ్డుపై నిలవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. సరైన డ్రైనేజీ కాలువలు లేకనే రోడ్లపైకి నీరు వస్తున్నాయని ప్రజలు వాపోయారు. వెంటనే అధికారులు నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

భారీ వర్షానికి కూలిన చెట్టు

హనుమకొండలో ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షానికి అశోక్ కాలనీలో చెట్టు కూలింది. కూలిన చెట్టు విద్యుత్తు లైన్ మీద పడడంతో విద్యుత్ లైన్ తెగిపోయింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.  చేరుకొని పడిపోయిన చెట్టును డిఆర్ఎఫ్ సిబ్బంది తొలగించారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది చేరుకొని విద్యుత్ లైన్ పునరుద్ధరణపనులు చేపడుతున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకపోవడం వలన ప్రజలు, కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.

ఎమ్మెల్యే ఆదేశించిన చర్యలు శూన్యం 

హనుమకొండ అంబేద్కర్ భవన్ వద్ద వర్షం నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన పట్టించుకోకపోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. చిన్న వర్షం పడితే చాలు అంబేద్కర్ భవన్ ప్రాంగణం నీటితో నిండి పోతుందని వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నరని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అధికారులు ఇప్పటికైనా స్పందించి పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.