calender_icon.png 7 September, 2025 | 10:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష విత్తనాలు సేకరించి చల్లడమే లక్ష్యం

07-09-2025 06:32:03 PM

నకిరేకల్ (విజయక్రాంతి): లక్ష విత్తనాలు సేకరించి ఖాళీప్రదేశాలలో చల్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ సభ్యులు బ్రహ్మదేవర నరేష్, కర్నాటి నరేష్, గుండు విక్రమ్ తెలిపారు. ఆదివారం వారు ఖాళీ ప్రదేశాలలో విత్తనాలను చల్లె కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనల్ని పరిరక్షిస్తుందన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు విద్యార్ధులతో కలిసి 10 వేల విత్తనాలు సేకరించి చల్లామన్నారు.  మరో 5000 అల్ల నేరేడు విత్తనాలు సేకరించమన్నారు.  జిల్లాలోని విద్యార్ధులు, తల్లిదండ్రులు సేకరించి కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని కోరారు. విత్తనాలు ఉంటే మా ప్రకృతి ప్రయాణం చరవాణి నంబర్ 8885771431లో సంప్రదిస్తే మేము స్వయంగా వచ్చి తీసుకుంటామన్నారు.