calender_icon.png 7 September, 2025 | 10:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

మీలాద్ ర్యాలీ విజయవంతం చేయండి

07-09-2025 06:48:10 PM

నిర్మల్ (విజయక్రాంతి): మీలాద్ ర్యాలీని విజయవంతం చేయాలని నిర్వాహకులు ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. 5 సెప్టెంబర్ మీలాద్ ఉన్ నబి(Milad-un-Nabi) ఉండెనని గణేష్ నిమజ్జనాలు ఉండడంతో వాయిదా వేసుకున్నామని పేర్కొన్నారు. ఈ నిర్ణయం మత సామరస్యానికి ప్రతీకగా అంటూ అభిప్రాయపడ్డారు. సోమవారం పట్టణ ప్రియదర్శిని నగర్ నుండి ప్రారంభం కానుందని పట్టణ ప్రధాన విధుల గుండా వెళ్లి తిరిగి మస్జీద్ ఏ ఇక్బాల్ ఉన్నిసా వద్ద ముగుస్తుందని తెలిపారు. ఇందులో మీలాద్ కమిటీ కార్యనిర్వాహణ అధ్యక్షులు ఇసాక్ అలీ, మనజిర్ బుఖారి, అహ్మద్ ఇంతియాజ్ అలీ, సయ్యద్ మూర్తుజ అలీ, సయ్యద్ అన్వార్ పాషా తదితరులు ఉన్నారు.