calender_icon.png 10 September, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్షమాపణలు చెప్పాలి..

09-09-2025 11:05:17 PM

బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పెంబల జానయ్య

మునుగోడు (విజయకాంతి): వినాయక మండపంలో ముస్లింలు, క్రైస్తవులు పూజలు చేస్తున్నారని హిందువులను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్షమాపణ చెప్పాలని బిజెపి మండల పార్టీ అధ్యక్షులు జానయ్య(BJP Mandal Party President Janaiah) అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం వ్యక్తం చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఫిర్యాదు అందజేసి మాట్లాడారు. వినాయక నిమజ్జనం సందర్భంగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ జిల్లాలో వినాయక విగ్రహ మండపం దగ్గర  పూజలో పాల్గొని  ముస్లింలను & క్రైస్తవులను పొగుడుతు వారు ఈ వినాయక మండపాలలో పూజలు చేస్తున్నట్టు మాట్లాడడం హిందువులను అవమానపరిచే విధంగా ఉందన్నారు.

చర్చిలలో మసీదులలో పాల్గొని హిందువుల పూజల గురించి వర్ణించాలని లేనిచో హిందువులకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు భవనం మధుసూదన్ రెడ్డి,మాధగోని నరేందర్ గౌడ్, కర్నాటి లింగయ్య,నీరుడు రాజా రామ్ ,పందుల యాదయ్య ,కర్నాటి శేఖర్ గౌడ్,కొత్త శంకర్,చోల్లేటి బ్రహ్మచారి,విష్ణు,నాతి నరసింహ,నెల్లికంటి రమేష్,పెరమళ్ళ శ్రీరామ్ ,పోలె వెంకటేశ్వర్లు,బొజ్జ రాములు,బోయపల్లి రవి,పిట్టల రాములు ఉన్నారు.