calender_icon.png 10 September, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో సాయుధ పోరాటంకు నిజమైన వారసులు కమ్యూనిస్టులే..

09-09-2025 10:59:37 PM

- సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న బిజెపి

- సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండా శ్రీశైలం,పాలడుగు నాగార్జున.

మునుగోడు (విజయక్రాంతి): రాష్ట్రంలో సాయుధ పోరాటంకు నిజమైన వారసులు కమ్యూనిస్టులే, భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన మహోత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను చాకలి ఐలమ్మ వర్ధంతి పదవ తేదీ నుండి 17 వరకు జరిగే సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, పాలడుగు నాగర్జున, సిహెచ్ లక్ష్మీనారాయణలు ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం సిపిఎం మునుగోడు నియోజకవర్గ స్థాయి స్టడీ సర్కిల్ నాంపల్లి చంద్రమౌళి అధ్యక్షతన స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో నిజాం పాలనలో జరుగుతున్న దోపిడీ పీడన వెట్టిచాకిరికి దొరల జమీందారులు, జాగిర్దారులకు వ్యతిరేకంగా జరిగిన మహత్తర పోరాటంలో కమ్యూనిస్టు యోధాను యోధులు అనేక త్యాగాలు చేసి ప్రజలకు అండగా నిలబడ్డారని అన్నారు. ఈ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారని మూడు వేల గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయని, వెట్టిచాగిరి రద్దు చేయబడిందని జమీందారులను గ్రామాల నుండి తరిమికొట్టారని అన్నారు.

ఇలాంటి మహత్తర పోరాట చరిత్రను బిజెపి వక్రీకరించి ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందూ ప్రజలు పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఆ పోరాటంలో అనేకమంది ముస్లింలు ముగ్దీమ్ మోయీద్దిన్, సోయబుల్లా ఖాన్,షేక్ బందగి తదితరులు నిజాం పాలన వ్యతిరేకంగా విరోచితంగా పోరాడారని గుర్తు చేశారు.చరిత్రను చెడిపేయాలని  చూస్తే సూర్యునిపై ఉమ్మేసినట్టేనని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి మల్లేశం,మునుగోడు , మర్రిగూడ  చండూర్ మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్ , ఏర్పుల యాదయ్య,  జెరిపోతుల ధనంజయ్ , మండల కమిటీ సభ్యులు మిర్యాల భరత్ , వరికుప్పల ముత్యాలు , పగడాల కాంతయ్య , ముత్తిలింగం , కర్నాటి వెంకటేశం , కర్నాటి సుధాకర్ , వల్లూరి శ్రీశైలం, అచ్చిని శ్రీను , మాలిగా శివ , పర్సనగోని యాదగిరి , రామలింగ చారి , కొత్తపెళ్లి నరసింహ , యాట గణేష్  ఉన్నారు .