calender_icon.png 10 September, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెల్ టవర్ తొలగించాలి

09-09-2025 11:07:16 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని ప్రాణహిత కాలనీలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఎయిర్టెల్ సెల్ఫోన్ టవర్ పనులను నిలిపి వేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు(Commissioner Rajalingu)కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీలో ప్రస్తుతం ఉన్నటు వంటి జియో టవర్, సోలార్ ప్లాంట్ వల్ల వాతావరణం కాలుష్యం అవుతుందని, అంతేకాకుండా మొబైల్ టవర్ల ద్వారా వెదజల్లుతున్న రేడియేషన్ మూలంగా కాలనీలో నివసిస్తున్న కార్మికులు, ప్రజలు వృద్ధులు చిన్నారులు తరచు అనారోగ్యానికి గురవు తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎయిర్టెల్ టవర్ నిర్మాణ పనులను నిలిపి వేయాలని నిలిపివేయాలని కోరారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ నవనిర్మాణ పనులను నిలిపివేయాలని  సమయత కాంట్రాక్టర్కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.