calender_icon.png 28 September, 2025 | 12:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి

27-09-2025 10:45:59 PM

కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): సాయి ధరమ్ తేజ్ యువత జాతీయ అధ్యక్షులు కాస రాజు డిమాండ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో మెగాస్టార్ చిరంజీవిపై ఎమ్మెల్యే, సినీన టుడు బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలు తప్పు అని సాయి ధరమ్ తేజ్ యువత జాతీయ అధ్యక్షులు కాస రాజు తెలిపారు. 

వ్యంగ్యంగా మాట్లాడి చిరంజీవిని కించపరచడం మెగా అభిమానులకు బాధ కలిగించిందన్నారు. బాలకృష్ణ బేషరతుగా చిరంజీవికి క్షమాపణ చెప్పాలని, అసెంబ్లీ రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలు తొలగించాలని, ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అలాగే స్పీకర్ ప్రత్యేక చొరవతో అవమానకర వాక్యాలను తొలగించాలని డిమాండ్ చేశారు.