calender_icon.png 27 September, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్ట్ ల సమస్యలు పరిష్కరించండి

27-09-2025 10:29:04 PM

మెట్ పల్లి,(విజయక్రాంతి): జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డుల వెంటనే ప్రభుత్వం జారీ చేస్తూ వారి సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని బీజేపీ సీనియర్ నాయకులు చిట్నేని రఘు అన్నారు. శనివారం తెలంగాణలో కాంగ్రెస్  ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్న జర్నలిస్టు అక్రిడేషన్  ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఎలక్షన్  ముందు జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం కాంగ్రెస్ జర్నలిస్ట్ లకు ఎన్నో హామీలు ఇచ్చింది.

కనీసం ఒక్క హామీ కూడ నెరవేర్చ లేదు. జర్నలిస్టులకు వెంటనే కొత్త అక్కడేషన్ కార్డు ఇవ్వాలి  జర్నలిస్టుల హెల్త్ కార్డులు రాష్ట్రవ్యాప్తంగా పలు సమస్యలతో  ఉన్నవి.  ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చే ఒకే ఒక్క అవకాశం అక్రిడేషన్  మాత్రమే అది కూడా ఇవ్వకపోవడం దురదృష్టకరం జర్నలిస్టుల కుటుంబాలకు అందరికీ బస్సు పాస్ లు స్టేట్ పాస్ ఇవ్వాలి. వెంటనే హెల్త్ కార్డులు జారీ చేసి హెల్త్ కార్డులో ఉన్న సమస్యలు అన్నీ తీర్చాలి.