calender_icon.png 28 September, 2025 | 12:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫస్ట్ కేంద్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

27-09-2025 10:53:06 PM

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): బతుకమ్మ సంబరాలు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మహబూబ్ నగర్ ఫస్ట్ శిక్షణా కేంద్రంలో శనివారం ఘనంగా జరిగాయి. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సతీమణి యెన్నం లక్ష్మి ప్రసన్న ముఖ్య అతిథిగా హాజరై మహబూబ్ నగర్ ఫస్ట్ లో శిక్షణ పొందుతున్న మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా  యెన్నం లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ   వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని జీవితంలో స్థిరపడాలని ఆమె తెలిపారు. మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా ఇస్తున్న వివిధ కోర్సుల్లో మీరంత మంచిగా శిక్షణ తీసుకొని , మీ కాళ్ళమీద మీరు నిలబడి జీవితంలో స్థిరపడాలని ఆమె సూచించారు. మీ అందరితో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందన్నారు.  మీరందరూ దసరా పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆమె అన్నారు.