calender_icon.png 28 September, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ సేవలు పదిలం

27-09-2025 10:41:14 PM

ఆశా కార్యకర్తలకు చీరలను అందించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): ఆశ కార్యకర్తల విధులు ఎల్లప్పుడూ పదిలంగా ఉంటాయని ఎమ్మెల్యే ఎల్లప్పుడూ పదిలంగా ఉంటాయని యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్యే వారి సతీమణి  లక్ష్మి ప్రసన్న కలిసి మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన ఆశా కార్యకర్తలకు దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చీరలను  అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ....  దసరా పండుగను అందరూ ఘనంగా జరుపుకోవాలని అన్నారు.  మీరు ప్రజలకు అందుబాటులో ఉంటూ మీరు చేస్తున్న సేవలు చాలా అమోఘం అని చెప్పారు.  అనంతరం ఎమ్మెల్యేసతీమణి యెన్నం లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ మీ అందరికీ పసుపు కుంకుమ  ఇవ్వండం సంతోషంగా ఉందన్నారు.  నా ఇంటి ఆడపడుచులకు పసుపు బొట్టు ఇచ్చిన అనుభూతి నాకు కలిగిందని ఆమె అన్నారు .  అనంతరం  ఆశా కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే సతీమణి లక్ష్మి ప్రసన్న  బతుకమ్మ ఆడారు.