04-07-2024 01:31:50 AM
ఎన్‌ఐఏకు సుప్రీంకోర్టు చురకలు
న్యూఢిల్లీ, జూలై 3: నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎవరైనా, నేరం ఎలాంటిదైనా దర్యాప్తు త్వరగా పూర్తిచే యాలని కోరే హక్కు వారికి తప్పనిసరిగా ఉంటుందని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఏండ్లకేండ్లు దర్యాప్తు కొనసాగిస్తూ నిందితు లను జైళ్లలో మగ్గేలా చేయటం న్యాయాన్ని అపహాస్యం చేయటమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. ముంబైకి చెందిన జావేద్ గులామ్ నబీ షేక్‌ను 2020 ఫిబ్రవరి 9న అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టం కింద ఎన్‌ఐఏ అరెస్టు చేసి జైలుకు పంపింది. అతడు నాలుగేండ్లుగా అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు.
ఇటీవల షేక్ దాఖలుచేసిన బెయిల్ పిటిషన్‌పై ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ కేసులో దర్యాప్తు ముగించేందుకు మరికొంత సమయం కావాలని ఎన్‌ఐఏ కోరగా, కోర్టు తిరస్క రించింది. ‘న్యాయాన్ని అపహాస్యం చేయక ండి. నిందితుడికి దర్యాప్తు వేగంగా పూర్తి చేయాలని కోరే హక్కు ఉన్నది. అతడు గత నాలుగేండ్లుగా జైల్లోనే ఉన్నాడు. ఇప్పటికీ అతడిపై మీరు అభియోగాలు కోర్టులో దాఖలు చేయలేదు’ అని మండిపడింది.