30-10-2025 12:00:00 AM
 
							ప్రభాస్ పాన్‌ఇండియా రెబల్ స్టార్‌గా అభిమానుల ఆదరాభిమానాలు చూరగొంటూ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన కథానాయకుడిగా మారుతి దర్శకత్వం వహిస్తున్న ‘ది రాజాసాబ్’ సంక్రాంతికి విడుదల కానుంది. దర్శకుడు హను రాఘవపూడితోనూ ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడీ డార్లింగ్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ‘సలార్2’, నాగ్‌అశ్విన్‌తో ‘కల్కి2’ చేయాల్సి ఉంది. వీటి మధ్యలో సందీప్ వంగా కాంబో లో రాబోయే ‘స్పిరిట్’ పట్టాలెక్కనుంది.
ఇటీవలే బాలీవుడ్ ముద్దుగుమ్మ త్రిప్తి డిమ్రీని హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో విలన్‌గా ఓ హాలీవుడ్ స్టార్ నటిస్తున్నాడని తెలుస్తోంది. కొరియన్ స్టార్ హీరో డాన్‌లీ ‘స్పిరిట్’లో ప్రభాస్‌తో తలపడనున్నారని సమాచారం. ఈ విషయంలో చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు కానీ, కొరియన్ మీడియాలో వార్తలొస్తున్నాయి. మరోవైపు అభిమానులు సైతం ప్రభాస్ సినిమాలో డాన్ లీ పక్కా అంటూ కన్ఫర్మ్ చేస్తున్నారు.