calender_icon.png 1 November, 2025 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటర్ నమోదు మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి

31-10-2025 06:10:40 PM

బేల,(విజయక్రాంతి): రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గ్రామం యూనిట్‌గా, వార్డుల వారీగా ఓటర్ల జాబితా మ్యాపింగ్ తయారు చేస్తున్నట్టు బేల మండల తహసీల్దార్ రఘునాథ్ రావ్ తెలిపారు. శుక్రవారం బేల లోని ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ స్థాయి బూత్ లెవల్ అధికారులతో తహసీల్దార్ పంచాయతీ ఓటర్ జాబితా మ్యాపింగ్ తయారు కోసం సమావేశం నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో గ్రామ పంచాయతీ ఓటర్ నమోదు మ్యాపింగ్ ప్రక్రియ అధికారుల పర్యవేక్షణలో పంచాయతీ సెక్రెటరీ, కంప్యూటర్ ఆపరేటర్స్‌తో పగడ్బందీగా కొనసాగుతుందని చెప్పారు. 

దీనిలో భాగంగా పంచాయతీ కార్యదర్శులు, బీఎల్‌వోలు రూపొందించిన ఓటర్ల జాబితాను టీపోల్ యాప్‌లో నమోదు చేసేందుకు ప్రతి పంచాయతీకి ప్రత్యేకంగా ఒక లాగిన్ ఐడీ, పాస్‌వార్డును అందించారన్నారు. కొత్తగా ఏర్పడిన ఒక్కో పంచాయతీలో ఆరు వార్డులకు తగ్గకుండా ఓటర్లను విభజించాలని అందులోనూ ఒక కుటుంబం ఒక వార్డులోనే ఉండేలా నమోదు చేయాలన్నారు.