31-10-2025 06:33:29 PM
 
							సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం భారతదేశపు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగినది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ నల్ల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతిని జరుపుకొనుచున్నామని స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ తో సహా సంస్థానాలన్నింటిని దేశంలో విలీనం చేయించి ఐక్యంగా ఉండేలా కృషి చేసినందుకు గుర్తుగా నేడు మనం జాతీయ ఐక్యత దినోత్సవం జరుపుకొనుచున్నామని తెలిపారు. అనంతరము జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేయడమైనది.