calender_icon.png 1 November, 2025 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంకేతికతపై అవగాహన కార్యశాల

31-10-2025 06:30:36 PM

పటాన్ చెరు: గీతం హైదరాబాదులోని గిట్ హబ్ (విద్యార్థుల నేతృత్వంలోని టెక్ కమ్యూనిటీ) క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం అధునాతన సాంకేతికతలపై అవగాహనా కార్యక్రమాన్ని ‘గిట్ సెట్ గో’ పేరిట తొలి విడత శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులే తమ తోటి విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ఈ కార్యశాల ప్రత్యేకత. సైద్ధాంతిక అవగాహనకు మించి ఆచరణాత్మక అనుభవాన్ని అందించడం, ఇందులో పాల్గొనేవారు వ్యక్తిగత ప్రాజెక్టుల కోసం గిట్ ని నమ్మకంగా ఉపయోగించడానికి, ఓపెన్-సోర్స్ కమ్యూనిటీలకు దోహదపడటానికి సాధికారత కల్పించడంపై ఈ కార్యశాల దృష్టి సారించింది.

వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ (డీసీఎస్), సహకార సాఫ్ట్ వేర్ అభివృద్ధిలో వాటి ప్రాముఖ్యత యొక్క అవలోకనంతో ఈ కార్యశాల ప్రారంభమైంది. గిట్ ఇన్ స్టాలేషన్, కాన్ఫిగరేషన్, రిపోజిటరీ సృష్టి, క్లోనింగ్ ద్వారా మార్గనిర్దేశం చేశారు. తరువాత ఫోర్కింగ్ షేర్డ్ రిపోజిటరీలతో పనిచేయడం నేర్పించారు. గిట్ హబ్ విద్యార్థి అభివృద్ధి కోసం ఉద్దేశించడానికి గల కారణాలు, దాని ప్రయోజనం, వినియోగాలను వివరించారు. ఇందులో పాల్గొన్నవారికి ఆయా అంశాలపై స్పష్టత, సాంకేతిక అవగాహన ఏర్పడ్డాయి. సీఎస్ఈ మూడో ఏడాది విద్యార్థులు సాయి గురు, హర్ష ఈ కార్యక్రమంలో ప్రధాన శిక్షకులుగా వ్యవహరించారు. దాదాపు 40 నుంచి 50 మంది విద్యార్థులు ఈ కార్యశాలలో పాల్గొని ఆయా సాంకేతికతలు, అధునాతన అంశాలపై లోతైన అవగాహనను ఏర్పరచుకున్నారు.