calender_icon.png 1 November, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసు ఉద్యోగం సవాళ్లతో కూడుకున్నది: రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు

31-10-2025 06:16:58 PM

మల్కాజ్గిరి,(విజయక్రాంతి): పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ పేర్కొన్నారు. రాచకొండ పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పదవీ విరమణ పొందిన ఉప్పల్ ట్రాఫిక్ పీఎస్‌కు చెందిన మహిపాల్ రెడ్డి, పోలీస్ కంట్రోల్ రూమ్‌కు చెందిన రవీంద్ర రెడ్డి, లాలయ్య, హయత్‌నగర్ పీఎస్‌కు చెందిన రాజేశ్వర్, యాదగిరిగుట్ట పీఎస్‌కు చెందిన ఆనంద్ నాయక్ లను కమిషనర్ ఘనంగా సన్మానించారు.

ఈ సందర్బంగా రాచకొండ కమిషనర్ మాట్లాడుతూ... విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్లను ఎదుర్కొంటూ క్రమశిక్షణతో, సమర్థవంతంగా సేవలందించినందుకు వారిని అభినందించారు. పదవీ విరమణ అనంతరం ప్రశాంత జీవితం గడపాలని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. పెన్షన్ మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ ఇందిరా, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శివకుమార్, సీసీఆర్బీ ఏసీపీ రమేష్, సీఏఓ అడ్మిన్ పుష్పరాజ్, ఏఏఓ అశోక్ రెడ్డి, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు సిహెచ్. భద్రా రెడ్డి, కో-ఆపరేటివ్ డైరెక్టర్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు.