31-10-2025 06:20:43 PM
 
							కాప్రా,(విజయక్రాంతి): పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పర్యవేక్షణలో తల్లూరి ఎక్స్ రోడ్ వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్‌కార్ట్ వ్యాపారులు, చిన్న వ్యాపారులు మరియు ప్రయాణికులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. పోలీసు అమరవీరుల త్యాగాలకు సంఘీభావం ప్రకటించడానికి మరియు నివాళులు అర్పించడానికి స్థానిక వ్యాపారులు, ప్రయాణికులు పాల్గొన్నారు.