31-10-2025 06:13:37 PM
 
							ఉప్పల్,(విజయక్రాంతి): ఘనంగా ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవం CPI ఉప్పల్ మండల కార్యదర్శి టీ.సత్య ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జెండా ఆవిష్కరణ ఏఐటీయూసీ భారత ఆహార సంస్థ హమాలీ సంఘం ప్రధాన కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్ ఎగరావేయడం ఎగరవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 1920లో ఏఐటీయూసీ కార్మిక సంఘం గా ఏర్పడి నేటికీ 106వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాము.
అనేక మంది అమరవీరుల త్యాగల ఫలితాము మనం ఇప్పుడు ఈ హక్కులను అనుభవిస్తున్నాము అని గుర్తుచేశారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వ గతంలో సాధించుకున్న హక్కులను కల్లారస్తున్నది అని అన్నారు. మోడీ ఎల్ఐసీ సంస్థ నుండి రెండు లక్షలా రూపాయలు అప్పన్నం ఇచ్చింది. అదే పేద వాడికి వంద రూపాయలు ఇవ్వడానికి ఎంతో ఆలోచిస్తారు. కనుక కార్మిక ర్యాజం కోసం మరో పోరాటం చేయాలని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమం లో నాయకులు పొన్నికంటి దస్తగిరి, సందేశ్, యాదయ్య, తదితరులు పాలొగొన్నారు..