calender_icon.png 1 November, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంటలు నష్టపోయిన రైతుకు ఎకరానికి 40 వేలు చెల్లించాలి

31-10-2025 06:25:54 PM

బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవరెడ్డి

సుల్తానాబాద్,(విజయక్రాంతి): మొంథా తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, జిల్లా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి, పంట నష్టం అంచనా వేయాలని భారతీయ జనతా పార్టీ సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండలంలోని  రేగడి మద్దికుంట గ్రామంలో ఐకేపీ సెంటర్ ని భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి, సీనియర్ నాయకులు మీస అర్జున్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి, నల్ల మనోహర్ రెడ్డి లు శుక్రవారం సందర్శించడం జరిగింది.

మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన అకాల వర్షంతో దెబ్బతిన్న పంటపొలాలను, ఐకెపి కొనుగోలు కేంద్రాలను పరిశీలించి,రైతులతో మాట్లాడారు.పంట నష్టపైన రైతులకు ఎకరానికి 40 వేల చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించాలని,అలాగే కొనుగోలు కేంద్రాలు వర్షంతో తడిచిన వరి ధాన్యాన్ని నాణ్యతా ప్రమాణాల పేరుతో కటింగ్ లేకుండా  కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్, అమరగాని ప్రదీప్ కుమార్, నాయకులు ఎర్రంశెట్టి మునిందర్, చాతరాజు రమేష్, పెర్క రమేష్, మారం రమేష్, రామకృష్ణ, భూసరపు సంపత్, ఎర్రం సంతోష్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, శశి వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.