calender_icon.png 1 November, 2025 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ సమగ్రతకు విద్యార్థులు యువత పాటుపడాలి

31-10-2025 06:08:00 PM

ఉప్పల్,(విజయక్రాంతి): దేశ సమగ్రతకు విద్యార్థులు యువత పాటుపడాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జన్మదినం పురస్కరించుకొని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నేతృత్వంలో రాష్ట్ర ఏక్ దివాస్ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ఉప్పల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ఎవరెస్ట్ అధిరోహించిన అన్విత రెడ్డి  ముఖ్యఅతిథిగా హాజరై  రన్ ఫర్ యూనిటీ జెండాను ఊపి ప్రారంభించారు. ఉప్పల్ ఎక్స్ రోడ్ నుండి ఉప్పల్ క్రికెట్ స్టేడియం వరకు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సి పి సుధీర్ బాబు మాట్లాడుతూ... సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న జాతీయ ఐక్యత దినోత్సవం లేదా రాష్ట్రా ఏ దివాస్ గా జరుపుకుంటున్నారని తెలిపారు. భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడంలో  సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి గురించి వారు వివరించారు. దేశ సమగ్రతకు కాపాడేందుకు యువత  సిద్ధం కావాలని ఆయన సూచించారు. ఈ రన్ భారతదేశంలో ఉన్న పౌరులు అందరు ఏకతాటిపై ఉన్నారని తెలియచేయడానికి రన్ ఫర్ యూనిట్ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.