calender_icon.png 14 October, 2025 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీసీసీ పదవి రేసులో కోటగిరి సతీష్ గౌడ్

14-10-2025 07:14:42 PM

చిట్యాల (విజయక్రాంతి): జయశంకర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి టేకుమట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ బరిలో నిలిచారు. ఇటీవల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకానికి కసరత్తు ప్రారంభించింది. ఇటీవల రాష్ట్ర ఎన్నికల పరిశీలకులతో పాటు జిల్లాలో ఇంచార్జిలను నియమించింది. ఆశవాహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా కోటగిరి సతీష్ గౌడ్ మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడిగా అవకాశమిస్తే పార్టీని మరింత పటిష్టపరిచి, నూతన నాయకులను పార్టీకి అందిస్తామని తెలియజేశారు.

గత 15 సంవత్సరాలుగా కరుడుగట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, యువజన కాంగ్రెస్ నాయకుడిగా,కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి ఎంతోమంది యువజన కాంగ్రెస్ సైనికులను తయారు చేసినట్లు వివరించారు.పార్టీకి కొత్త తరాన్ని అందించడానికి నా పాత్ర పోషించానని గుర్తు చేశారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనలో తనతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేశారని, అక్రమ కేసులు బనాయించి, ఆర్థికంగా మానసికంగా హింసించిన భరించి బాధ్యతతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చానని తెలిపారు. కావున జిల్లా పెద్దలు గమనించి అధ్యక్ష పదవిని అందజేయాలని ఈ సందర్భంగా కోరారు.