14-10-2025 07:17:29 PM
ఖానాపూర్: కడెం మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు మత్స్య కార్మికులు గోదావరిలో చిక్కగా మంగళవారం కడెం పోలీసులు వారిని రక్షించారు. చేపలు పట్టడానికి వెళ్లిన ఇద్దరు కార్మికులు మధ్యలో ఉండగా గోదావరిలో వరద పెరగడంతో నీటిలో చిక్కుకున్నారు. ఈ విషయాన్ని తెలిసిన పోలీసులు అక్కడికి వెళ్లి తాళ్ల సాయంతో వారిని బొడ్డుకు చేసినట్టు పోలీసులు తెలిపారు. చేపల కార్మికులను రక్షించిన పోలీసులకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు.