calender_icon.png 16 August, 2025 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవాళికి దిక్సూచి శ్రీకృష్ణుడి భగవద్గీతా జ్ఞానం

16-08-2025 07:04:06 PM

త్రైత సిద్ధాంతం ఆధ్వర్యంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

కోదాడ: మాయా ప్రపంచంలో చిక్కుకున్న మానవాళికి జగద్గురువు శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీతా జ్ఞానం దిక్సూచి అని త్రైత సిద్ధాంతం, ప్రబోధ సేవా సమితి కోదాడ శాఖ అధ్యక్షుడు పోటు వెంకటేశ్వర్లు అన్నారు. కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలోని శ్రీకృష్ణ మందిరం ఆవరణలో శనివారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆయన మాట్లాడుతూ... శ్రీకృష్ణుడు 90 సంవత్సరాల వయస్సులో యుద్ధ సమయంలో భగవద్గీత జ్ఞానం బోధించి 5 వేల సంవత్సరాలు దాటినా ఇప్పటి వరకు ఎవరికి అర్ధం కాలేదన్నారు.

భగవద్గీత అంటే కోర్టులో ప్రమాణం చేయడానికి, శవాల ముందు పెట్టే పాటల క్యాసెట్ గా మారిపోయిన పరిస్థితుల్లో ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వివరణ వ్రాసిన త్రైత సిద్ధాంత భగవద్గీత పూర్తిగా నూటికి నూరు శాతం శ్రీకృష్ణుడి నిజభావాన్ని తెలుపుతుందన్నారు. 571 శ్లోకాలతో వెలువడిన త్రైత సిద్ధాంత భగవద్గీత మనిషిలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తుందన్నారు. 18వ తేదీన గ్రామంలో జరిగే కృష్ణప్రతిమ ఊరేగింపును విజయవంతం చేయాలని కోరారు. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు హాజరై పూజల్లో పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. వేడుకల్లో ముత్తవరపు సుబ్బారావు, శైలజ, చందన, వంగాల మహేష్, విజయ, జాస్తి శివరామకృష్ణ, రమ్య, ఉల్లి రాము, అరుణ, సైదా, రాళ్ళబండి రామారావు, శైలజతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.