16-08-2025 07:06:21 PM
జయశంకర్ భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) గణపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత విద్యా సంవత్సరం 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పూర్వ విద్యార్థి నల్లు సూర్య ప్రకాశ్ రెడ్డి నగదు పురస్కారం అందజేశారు. శనివారం పాఠశాలలో హెడ్మాస్టర్ దేసు సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 1964-71 గణపురం పాఠశల పదో తరగతి చదివిన నల్లు సూర్యప్రకాశ్ రెడ్డి (విశ్రాంత బ్యాంకు ఉద్యోగి) 2024-25 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో ప్రథమ స్థానాన్ని పొందిన ఇద్దరు విద్యార్థిని విద్యార్థులు అనుఖ్, అంజలికి ఒక్కొక్కరికి 12 వేల నగదును వారి తల్లిదండ్రులైన తల్లిదండ్రులు నల్లు నరసింహా రెడ్డి, యశోదాదేవి జ్ఞాపకార్థం బహుమతిగా అందజేశారు.
ఈ సంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం కొనసాగిస్తానని ఆయన ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్, ఎంఈఓ ఊరుగొండ ఉప్పలయ్య గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్కూరి శ్రీనివాస్, గణపురం సొసైటీ చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్, ఓరుగంటి కృష్ణ గౌడ్, పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాత సూర్య ప్రకాష్ రెడ్డి ని ఘనంగా సత్కరించారు.