16-08-2025 08:36:29 PM
లక్షేట్టిపేట (విజయక్రాంతి): మున్సిపాలిటీలో గిరిజనుల సాంస్కృతిక పండుగ తీజ్ ఉత్సవాల ముగింపును శనివారం పెద్దఎత్తున మహిళలు, యువతులు, యువకులు, అందరూ కలిసి గిరిజనులు సాంప్రదాయ వేషాధారణలో ప్రత్యేక పూజలు చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... లంబాడ గిరిజనుల కుల దేవతకు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు, యువతులు సాంప్రదాయ నృత్యాలు చేసి తమ భక్తిని చాటుకున్నారు. బంజారా, లంబాడీ సంస్కృతి సాంప్రదాయానికి చాటి చెప్పే పండుగలలో అతి ముఖ్యమైనది తీజ్ పండుగ. తీజ్ అనగా గోధుమ మొలకలు అని అర్థం. ఈ పండుగను పెళ్ళి కాని అమ్మాయిలు శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు అత్యంత వైభవంగా జరుపుకుంటారని తెలిపారు.