calender_icon.png 16 August, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షబ్బీర్ అలీ చొరవతో ట్రాన్స్ఫార్మర్ బిగింపు

16-08-2025 08:24:36 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బీబీపేట్ మండలంలోని తూజాల్పూర్ గ్రామంలో వ్యవసాయపు బోర్లకు విద్యుత్ సరఫరా చేసే ఎస్ ఎస్ 20 గల 63 కెవి ట్రాన్స్ఫార్మర్ లో ఓల్టేజి సమస్య అధికంగా ఉండడంతో పలుమార్లు మోటార్లు కాలిపోతూ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ(Government Advisor Mohammed Shabbir Ali) దృష్టికి రైతులు తీసుకెళ్లగా తక్షణమే ఎస్ఈ శ్రావణ్ కుమార్ తో ఫోన్లో మాట్లాడి 100 కెవి నూతన ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయించగా శుక్రవారం రోజున ట్రాన్స్ఫార్మర్ బిగిచగా రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతులు పడుతున్న లో ఓల్టేజి ఇబ్బందులు తెలుపగానే సత్వరమే సమస్య తీర్చిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి రైతులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్ మెన్ కిషన్, రైతులు చంద్రాగౌడ్, తలారి ప్రభాకర్, శంకర్, దేవి, రాములు, రంజిత్ గౌడ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.