16-08-2025 08:27:33 PM
ఎస్సై మోహన్ రెడ్డి..
బిచ్కుంద (విజయక్రాంతి): గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి(SI Mohan Reddy) సూచించారు. పోలీస్ స్టేషన్ లో శనివారం ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఎస్సై మోహన్ రెడ్డి మాట్లాడూతూ.. వినాయక చవితి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు. ప్రతి ఒక్క యూత్ సభ్యుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. గణేష్ మండపాల నిర్వాహకుల ఫోన్ నెంబర్లతో పాటు పూర్తి వివరాలు ఇవ్వాలని తెలిపారు. శాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో యూత్ల సభ్యులు, కుల సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.