16-08-2025 08:20:41 PM
మరిపెడ (విజయక్రాంతి): మహబూబాద్ జిల్లా(Mahabubabad District) నరసింహుల పేట మండల కేంద్రంలో విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో విద్యుత్ భద్రత, పొలం బాట కార్యక్రమం పెద్ద నాగారం గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా నాణ్యమైన విద్యుత్ అందించడానికి ఈరోజు ఓవర్ లోడ్ 15 కెవిఎ ట్రాన్స్ఫార్మర్ నుండి 25 కెవిఎ నూతన ట్రాన్స్ఫార్మర్ మొదలు పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా నరసింహులపేట ఏఈ పాండు మాట్లాడుతూ, గ్రామస్తులకు విద్యుత్ ప్రమాదాల గురించి, భద్రతల గురించి వివరిస్తూ మీ యొక్క ఇంటి పరిసరాలలో బట్టలు ఆరవేయడానికి జిఐ వైరు వాడరాదు అలాగే పంట పొలాల వద్ద ప్రమాదకరంగా ఉన్న లైన్లు, కరెంటు ప్రవహించే ఎటువంటి వైరు(లైన్) తెగిపడిన అలాగే ట్రాన్స్ఫార్మర్పై వద్ద ఫీజులు పోయిన మీ విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించగలరు.
మీరు నేరుగా వేసినచో ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. కనుక ఎటువంటి అంతరాయం కలిగిన మీరు మరమ్మత్తులు చేయకుండా మీ దగ్గరలోని విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించగలరని, విద్యుత్ ప్రమాదాల నివారణ కొరకు సహకరించగలరని పెద్ద నాగారం విద్యుత్ వినియోగదారులను కోరారు. ఇట్టి కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ హరీష్, లైన్మెన్ లింగయ్య ఏ.ఎల్.ఎం అశోక్, ప్రశాంత్, రఫీ, సిబ్బంది పాల్గొన్నారు.